Cm-Cbn-Slams : క్షమాపణ చెప్పాల్సిందే Andhra Prabha Top News

Cm-Cbn-Slams : క్షమాపణ చెప్పాల్సిందే Andhra Prabha Top News

  • ఆ పార్టీకి అర్హత లేదు
  • డిఎస్సీ పరీక్ష అంటే తెలుసా
  • నిత్యం పనికిమాలిన ఆరోపణలే
  • గోడ్డలి పార్టీని దూరం పెట్టండి
  • ఆ నల్లచట్టాల్ని తగులపెట్టాం
  • రెవెన్యూలో మార్పులు తథ్యం
  • ఆక్వా రైతును ఆదుకుంటాం
  • సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు

( ఆంధ్రప్రభ, భీమవరం బ్యూరో)

Cm-Cbn-Slams :

గొడ్డలి పార్టీ చరిత్ర అందరికీ తెలుసు. నేరాలు చేసి ఎదుటి వాళ్లపై నెట్టేసే పరిస్థితి వారిది . వాళ్లు చేసిన ప్రతీ ఆరోపణకూ మాతో పాటు అధికారులు పూర్తిగా వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత గొడ్డలి పార్టీకి లేదు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. నిరుద్యోగులను క్షమించాలని అడగాలి. అది చేయలేకపోతే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు గొడ్డలి పార్టీకి అర్హత లేదు. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా గర్జించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీని తూర్పారబట్టారు. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడుతూ, రోజూ దుష్ప్రచారం చేస్తూ పనికి మాలిన పనులు చేస్తున్నారు. ప్రజలకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు నేను సంతోష పడుతున్నాను కానీ వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జా చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ఇక తెలంగాణాకు వెళ్లి ఎమ్మార్వో, జేసీ సంతకాలు ఫోర్జరీ రికార్డులు తారుమారు చేసి రూ.1500 కోట్ల అక్రమాలు చేశారుఇంత నేరం చేస్తే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు.. వినుకొండ మాజీ ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదు గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకు రారు కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్లకు… వరి కోతలు ఎలా తెలుస్తాయి గంజాయి బ్యాచ్‌ను ఓదార్చే వాళ్లకు… పంటల సాగు ఎలా తెలుస్తుంది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కూడా కల్తీ చేసి అపవిత్రం చేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే గొడ్డలి పార్టీ వ్యక్తులను ప్రజలు దూరంగా పెట్టాలి, సీఎం చంద్రబాబు సూచించారు.

Cm-Cbn-Slams : వీళ్లకి పరీక్షలంటే తెలుసా?

Cm-Cbn-Slams :

డీఎస్సీ పెట్టి దాదాపు 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. పరీక్షలు అంటే తెలీని వ్యక్తులు, రిజర్వేషన్లంటే తెలీని వాళ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు గత పాలకులు జాబ్ క్యాలెండర్ ఇస్తామని దగా చేశారు. మేం ఉద్యోగాలు ఇచ్చాం… జాబ్ కేలండర్ విడుదల చేశాంఏం చెప్పాలో తెలీక నేరాలు ఘోరాలు చేసి ఎదుటివారిపై దుష్ప్రచారం చేస్తున్నారు, వైసీపీ ముందుగా యువతను క్షమాపణ అడగి.. ఆ తరువాతే రాజకీయం చేయాలి, అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cm-Cbn-Slams : పచ్చటి నేలలో చిచ్చు పెట్టారు

Cm-Cbn-Slams :

పచ్చదనం అలరారే ఉమ్మడి పశ్చిమగోదావరి- తూర్పుగోదావరి జిల్లాలు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారాయి. భూమిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పంటలు పండించే రైతులు, ఈ ప్రాంత ప్రజలు చాలా సహృదయులు
వివాదాలు లేని ఈ ప్రాంతంలో గత పాలకులు చిచ్చు పెట్టి భూవివాదాలు సృష్టించారు. రికార్డులు తారుమారు చేశారు. ఈ ప్రాంతంలో బ్రిటిషర్లు నిర్వహించిన రికార్డుల కారణంగా ఏపీలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉండేవి. ఇప్పుడే భూ సమప్యలు పెరిగాయి. తెలంగాణాలో నిజాం పాలనలో ఒకే భూమిపై ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చారు. భూ కబ్జాలు పెరిగాయి. ప్రస్తుతం ఏపీలోనూ అదే స్థితి ఏర్పడింది. అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

Cm-Cbn-Slams : ఆ నల్ల చట్టం కాల్చేశాం

Cm-Cbn-Slams :

దుర్మార్గమైన గత పాలకుల నిర్వాకం కారణంగా అంతా గందరగోళంగా మారింది. ప్రజల భూముల విషయంలో సమస్యలు సృష్టించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఓ నల్ల చట్టం తెచ్చి భూమి కాజేసేందుకు గత పాలకులు ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూమి రికార్డులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తక్షణం రద్దు చేసి భూమి యాజమాన్య హక్కుల్ని రక్షించాం భూమి మీదైతే ఫోటోలు వారివి ముద్రించుకున్నారు. పొలం సరిహద్దు రాళ్లపై కూడా బొమ్మలు ముద్రించుకున్నారు భూతం తరహాలో రైతుల వెంటపడి రూ.800 కోట్లు పెట్టి గెలాక్సీ గ్రానైట్‌ రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సహా క్యూఆర్ కోడ్ లాంటి పటిష్టమైన చర్యలతో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం, అని సీఎం భరోసా ఇచ్చారు.

Cm-Cbn-Slams : రీ సర్వేతో హక్కులు కాపాడాం

Cm-Cbn-Slams :

రీ సర్వే చేయటంతో పాటు రైతుల్ని భాగస్వాములను చేసి వివరాలను తనిఖీ చేసి, ఈకేవైసీ చేశాక పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రిస్తున్నాం. కరెన్సీ నోట్లకు ఎన్ని భద్రతా ఫీచర్లు ఉంటాయో అదే తరహాలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూమి రికార్డులను అప్డేట్ చేశాం. 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశాం తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. మరో 62.32లక్షల పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. నిర్దేశిత గడువులోగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తాం, అని సీఎం హామీ ఇచ్చారు.

Cm-Cbn-Slams : వివాదాలు పరిష్కరిస్తాం

Cm-Cbn-Slams :

గ్రామాల్లో సర్వీసు ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫ్రీ హోల్డ్‌లో ఉంచాం. 22ఏ కింద ఈ భూములను పరిష్కరించి హక్కుదారులకు అప్పగిస్తున్నాం చిత్తూరు జిల్లాలో ఏళ్లుగా వివాదాల్లో ఉన్న శెట్టిపల్లి గ్రామ భూముల్ని పరిష్కరించి వారికి అప్పగించాం ప్రతీ నెలా వచ్చి నేరుగా భూ యజమానుల్ని, రైతులను కలిసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని పరిష్కరిస్తూ, భూ రికార్డులను ప్రక్షాళన చేసేందుకు 3 ఏళ్ల సమయం పట్టింది.
సర్వే పూర్తి చేసి వివాదాలు, అక్షర దోషాలు లేకుండా 90 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించాం, అని సీఎం ప్రకటించారు.

Cm-Cbn-Slams : అభివృద్ధిని ట్రాక్​ లో పెట్టాం

Cm-Cbn-Slams :

కూటమి ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెడుతున్నాం. అభివృద్ధిని ట్రాక్ లో పెట్టాం. అందుకే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరుగుతోంది సంక్షేమంలో దేశంలో ఎవరూ చేయలేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం సూపర్ సిక్స్ లో చెప్పినవాటికంటే అదనంగా ఇచ్చాం పెన్షన్, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్లు, మత్స్యకారులు ఇలా అందరికీ సంక్షేమం అందిస్తున్నాం అభివృద్ధి పరంగా 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. మన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. అపి సీఎం చంద్రబాబు వివరించారు.

Cm-Cbn-Slams : రెవెన్యూలో మార్పులు తథ్యం

Cm-Cbn-Slams :

రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నాం. రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చాం. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశాం. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100తో బదిలీ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులకు రూ.1,000 స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే చాలు 1బీ, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ వంటి పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించాం.9(2) నోటీసుల జారీ సమయంలో కూడా ఈ-కేవైసీ అమలు చేస్తున్నాం. 80 శాతం ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతనే గ్రామాలను వెబ్‌ల్యాండ్ 2.0లోకి తీసుకుంటున్నాం.
వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ సౌకర్యం కల్పించాం. తిరస్కరణ అధికారాన్ని తహసీల్దార్ నుంచి ఆర్డీఓ స్థాయికి పెంచాం. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను 22ఏ నుంచి తప్పించాం.
15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను కూడా తొలిగించాం, అని సీఎం చంద్రబాబు వివరించారు.

Cm-Cbn-Slams : గత ఇబ్బందులు ఉండవు

Cm-Cbn-Slams :

అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశాం. కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నాం. గోదావరి డెల్టా ప్రాంతంలో కాలువలు, చెరువుల మరమ్మతులు, నిర్వహణ సమర్ధవంతంగా చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మీరు ధాన్యం అమ్ముకోవడానికి కూడా రైతులు ఇబ్బందులు పడ్డారు. గత పాలనలో ధాన్యం అమ్మిన తర్వాత 6 నెలలు దాకా డబ్బులు పడేవి కాదు. నేడు 24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నాం. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Cm-Cbn-Slams : ఆక్వారైతుకు అండగా ఉంటాం

Cm-Cbn-Slams :

ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నాం. దాణా రేట్లు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే రాయితీలు ఇవ్వాలని, సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరాం. ఆక్వా రంగం రాష్ట్రానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా ఉంటాం, అని సీఎం హామీ ఇచ్చారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన నడుస్తోంది. సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాల నినాదంతో ముందుకు సాగుతున్నాం 10 లక్షల కోట్ల అప్పులు పెట్టారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేశారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాం. పశ్చిమగోదావరి పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు వస్తాయి పశ్చిమాసియా యుద్ధం సహా వేర్వేరు అంశాల కారణంగా ఆక్వా రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఆక్వా ఫీడ్ రేట్లు కూడా పెరిగాయి. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే కేంద్ర నిర్ణయం వస్తుంది . ఆక్వా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్ధాలు కాలుష్య సమస్యగా మారకుండా న్యూట్రాసిటికల్ ఔషధాలను తయారు చేసుకునే అవకాశం ఉంది. అపి సీఎం వివరించారు.

ALSO READ : Tdp-Rajya-Sabha : టీడీపీ పెద్దల సందడి Andhra Prabha Political News

Leave a Reply