నేడు ఏపీలో పదో తరగతి ఫలితాలు
నేడు ఏపీలో పదో తరగతి ఫలితాలు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను ప్రకటించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరుకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్ధులు ఫలితాల కోసం https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లలో తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
