Check list | చివరి దశ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి…

Check list | చివరి దశ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి…

Check list | మక్తల్, ఆంధ్రప్రభ : జిల్లాలో తొలి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్(election polling) ను విజయవంతంగా ముగించినట్లే చివరి విడత ఎన్నికల పోలింగ్ ను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఈ రోజు మూడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఉట్కూరు, మక్తల్ డిస్ట్రిబ్యూషన్/ రిసెప్షన్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో తొలి, రెండో విడత ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగించడంలో అధికారులు, పోలింగ్ సిబ్బంది కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. అయితే చివరి దశలో ఎన్నికల పోలింగ్ జరిగే ఊట్కూరు మక్తల్, మాగనూరు, కృష్ణా నర్వ మండలాల పరిధిలో ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ బూత్(polling booth)ల కంటే ఎక్కువ ఉన్నాయని, పోలింగ్ సిబ్బంది కూడా ఎక్కువగా నే ఉన్నారని అన్నారు.

బుధవారం జరిగే పోలింగ్ లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. పోలింగ్ సామాగ్రి తీసుకున్న వెంటనే ముందుగా పీవోలు, ఓపివోలుబ్యాలెట్ పత్రాలను సరి చూసుకోవాలని, చెక్ లిస్టు(Check list)లో ఉన్న సామాగ్రి అంతా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.

ఇతర జిల్లాలలో బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని, మన జిల్లాలో అలాంటి పొరపాటు జరగకుండా సిబ్బంది జాగ్రత్తగా పోటీ(Competition)లో ఉన్న అభ్యర్థులకు సరిపడా గుర్తులు ఉన్నాయా లేదా సరిగ్గా చెక్ చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఆమె పరిశీలించి, సామగ్రి పంపిణీ ప్రక్రియ సక్రమంగా సాగుతున్న తీరును అధికారుల(Officials)ను అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని, ఎన్నికల సిబ్బంది(election staff) లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు, డిస్ట్రిబ్యూ షన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. కృష్ణాలో 21847 మాగనూరులో 19145 మక్తల్ లో 43,701 నర్వలో 26,175 ఊట్కూరులో 41,780 మొత్తం 1,52,648 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

పిఓఓపిఓ లు 25 86 మంది 32 మంది జోనల్ ఆఫీసర్లు 29 మంది రోడ్డు ఆఫీసర్లు నియమించినట్లు జిల్లాలో 52 క్రిటికల్ పోలింగ్(Critical Polling) కేంద్రాలలో కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు 1083 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడించారు.

Leave a Reply