AP | ఏపీకి కేంద్రం భారీ నజరా..

AP | ఏపీకి కేంద్రం భారీ నజరా..
రూ. 1805 కోట్ల ఉపాధి హామీ నిధులు విడుదల!
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీగా గ్రామీణాభివృద్ధి నిధులను విడుదల చేసింది. ఉపాధి హామీ వేతనాల విభాగం కింద రూ. 1805.24 కోట్లు మంజూరు చేయడంపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో వేతనాలను సకాలంలో చెల్లించడంతో పాటు, రాష్ట్రంలో గ్రామీణ ఉపాధిని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
