నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా చైర్ పర్సన్ పర్యటన..

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చేర్మెన్ గణేష్ చక్రవర్తిలు హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు, మాజీ మంత్రి వేణుగోపాల చారితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ అభివృద్ధిలో తనవంతు సహకారం అందించాలని కోరారు. నిర్మల్ పట్టణ సమస్యల పరిష్కారానికి అత్యధిక నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలాన్నారు. నిర్మల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెలుతానని సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారని ఛైర్మెన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తిలు పేర్కొన్నారు.
