Machilipatnam | వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు…
అనుమతి లేకుండా ర్యాలీ – పేర్ని కిట్టుతో పాటు 20 మందిపై కేసులు
Machilipatnam | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టుతో పాటు మరో 20 మందిపై, మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి.
నిన్న నిర్వహించిన నిరసన ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో బీఎన్‌ఎస్ 341, 188, 143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ర్యాలీలో పాల్గొన్న మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకులపై కూడా కేసులు నమోదు చేసినట్లు మచిలీపట్నం పోలీసులు తెలిపారు.
