హనుమాన్ జంక్షన్ లో దారుణ హత్య
హనుమాన్ జంక్షన్ లో దారుణ హత్య
గన్నవరం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ద్విచక్ర వాహనం పై వెళుతున్న వ్యక్తిని కారుతో మంగళవారం రాత్రి ఢీ కొట్టి దారుణంగా హతమార్చారు. హనుమాన్ జంక్షన్ లో హెచ్ మార్ట్ (ఓనర్) వడ్డీ క్రాంతి కిరణ్ దారుణ హత్యకు గురయ్యారు. హెచ్ మార్ట్ ఓనర్ వడ్డీ క్రాంతి కిరణ్ ఇంటికి వెళ్లే తరుణంలో జరిగింది.

పాత కక్షల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ కి చెందిన రామినేని రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ద్విచక్ర వాహనం పై వెళుతున్న వడ్డీ క్రాంతి కిరణ్ ను కారుతో విచక్షణారహితంగా వెనక నుండి బలంగా ఢీ కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ద్విచక్ర వాహనం పై వెళుతున్న వడ్డీ క్రాంతి కిరణ్ సంఘటన స్థలంలోని మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్ లో గ్రామీణ వాతావరణం ఉలిక్కిపాటుకు గురైయింది.
