Bogatha Waterfall| పర్యాటకులతో కిక్కిరిసిన మినీ నయాగరా
వాజేడు, ఆంధ్రప్రభ : తెలంగాణ మినీ నయాగరా జలపాతంగా పేరు గాంచిన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బోగత జలపాతం జలసంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు రాష్ట్ర నలుమూలల నుండి కాక వివిధ రాష్ట్రాల నుండి పకృతి ప్రేమికులు అత్యధికంగా తరలిరావడంతో బొగత జలపాత ప్రాంగణం జనసంద్రంగా కి్క్కిరిసింది. జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు ముందుగా బొగత అందాలను వీక్షిస్తూ బోగత జలపాతం ప్రాంగణంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో జలకలాడుతూ బొగుత అందాలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .
పిల్లాపాప ముసలి ముతక అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా జలపాతాన్ని సందర్శించి రోజత్తమానం జలపాత్ర ప్రాంగణంలో కాలం గడుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా సెలవు రావడంతో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు అత్యధికంగా తరలివచ్చారు. దీంతో ఎక్కడ చూసినా పర్యటకులే దర్శనమిస్తున్నారు. బోగత జలపాతం అందాలకు ఆకర్షితులైన పర్యాటకులు అత్యధికంగా తరలిరావడంతో బొగత జలపాత ప్రాంగణం కిక్కిరిసిపోయి దర్శనమిస్తుంది.
