Birthday | పెళ్లి తర్వాత తొలి బర్త్‌డే..

Birthday | పెళ్లి తర్వాత తొలి బర్త్‌డే..
Birthday | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: శోభితతో పెళ్లి తర్వాత నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. నేడు శోభిత పుట్టినరోజు కావడంతో చైతన్య సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, వారిద్దరికీ సంబంధించిన అరుదైన ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా చైతూ తన మనసులోని మాటను వ్యక్తపరుస్తూ.. “హ్యాపీ బర్త్‌డే మై లేడీ.. నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశం దక్కినందుకు నేను కృతజ్ఞుడిని” అని ఎంతో ప్రేమగా పేర్కొన్నారు. వివాహం జరిగిన తర్వాత శోభిత మొదటి పుట్టినరోజు కావడంతో నాగచైతన్య చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చైతూ అభిమానులు సైతం శోభితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

