Basara-Theft : దొంగలు వాళ్లిద్దరే Andhra Prabha Crime News
Basara-Theft : దొంగలు వాళ్లిద్దరే Andhra Prabha Crime News
- సీసీ పుటేజీతో గుట్టురట్టు
- రంగంలోకి క్లూస్ టీం
- బాసర ఆలయంలో చోరీ కలకలం
( ఆంధ్రప్రభ, బాసర (నిర్మల్ జిల్లా)
బాసర అమ్మవారి ఆలయంలో వరుస చోరీ కలకలం రేపుతోంది.రెండు సంవత్సరాల కాలంలో రెండు మార్లు ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం మహాకాళి ఆలయంలో అమ్మవారికి చెందిన కిలో 200 గ్రాముల వెండి, హుండీలోని నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్ళారు.
Basara-Theft : చోరీ ఘటనలో ఇద్దరు

మహంకాళి ఆలయ చోరీ ఘటన లో ఇద్దరు వ్యక్తులు సీసీ కెమెరాకు చిక్కారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
Basara-Theft : కానరాని భద్రత చర్యలు
ఆలయ ప్రధాన ద్వారం వద్ద భద్రతా చర్యలు కానరావడం లేదు. భక్తులను తనిఖీ చేసేందుకు డోర్ ఫ్రేమ్స్, మేటల్ డిటెక్టర్లు లేవు. దీంతో భక్తులను తనిఖీ చే యకుండానే లోపలికి అనుమతిస్తున్నారు. చోరీ ఘటన చోటు చేసుకున్న ఆలయ అధికారులు అలసత్వం విడడం లేదు. ఇప్పటికైనా ఆలయ అధికారులు భక్తుల భద్రత, ఆలయానికి పటిష్టమైన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు.
