సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మంగళవారం ఉదయం సింగపూర్ చేరుకున్న మంత్రులు కింజార‌పు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డిలకు సింగపూర్ లోని తెలుగు అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం నుండి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు సింగపూర్‌లో అధికారికంగా మంత్రులు బృందం పర్యటిస్తుంది. సింగపూర్‌లో ఆధునిక పరిపాలనా విధానాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది.

సింగపూర్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ తో సింగపూర్- ఏపీ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ అవగాహన ఒప్పందంలో భాగంగా, సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టిఒటి) శిక్షణా కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారని మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Leave a Reply