తెలుగుజాతి చరిత్ర పరిరక్షణకు చర్యలు
మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం
మహనీయుల లేఖలన్నీ అర్కీవ్స్‌లో ఉన్నాయి
స్పెషల్ నీడ్స్ పిల్లలకు ప్రత్యేక బోధనా
ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తాం
వెలగపూడి, ఆంధ్రప్రభ :
అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు వంటి మహనీయులు రాసిన లేఖలతో వివిధ ప్రాచీన పత్రాలను సంరక్షిస్తామని, దీని కోసం అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రాచీనపత్ర భాండాగారం నుంచి అధికారిక పత్రాలు, శాసనాలు, రికార్డులు రాష్ట్రానికి రప్పించే అంశంపై శాసనసభలో మంత్రి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు.. తెలుగుజాతి చరిత్ర పరిరక్షణకు ఆర్కీవ్స్, ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి, డిస్ట్రిక్ట్ గెజిట్స్ అనే మూడు సంస్థలు ఉన్నాయని అయన చెప్పారు. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు వంటి మహనీయులు రాసిన లేఖలు ఆర్కీవ్స్ ఉన్నాయని, రాష్ట్ర విభజన తర్వాత ఈ అంశాన్ని షెడ్యూలు 10లో చేర్చారని వెల్లడించారు..
డిజిటలైజ్ చేసేందుకు చర్యలు..
ఏపీకి చెందిన జాతి సంపదను కాపాడాకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దీనిపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాలని బుద్ద ప్రసాద్ కోరారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. లైబ్రరీస్ పై మూడు సార్లు రివ్యూ చేశాం అన్నారు.., ఆర్కివ్స్ పై వెనుకబడి ఉన్నామని.. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అన్నారు.. 10వ షెడ్యూలులో ఈ సంస్థ ఉందన్నారు.. మొత్తం 15 కేటగిరిల రికార్డులకుగాను 7 కేటగిరిలు ఇచ్చారన్నారు. రెండు కాపీలు ఉన్నవి. ఒకటి మనకు ఇచ్చా, ఒకే ఒక కాపీ ఉన్నవాటిపై చర్చించాల్సి ఉంది. డిజిటలైజ్ చేసి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తాం. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరాం, అవసరమైతే సీఎస్ఆర్ నిధులు తెచ్చి పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తాం. పెద్దఎత్తున డిజిటలైజేషన్ చేపట్టాల్సి ఉంది. 24,347 చదరవు అడుగుల అద్దె భవనంలో ప్రస్తుతం ఆర్కివ్స్ విభాగం పనిచేస్తోంది, అక్కడే రికార్డులన్నీ నిర్వహిస్తున్నాం. రాష్ట్రవిభజన తర్వాత మనకు సెంట్రల్ లైబ్రరీ లేనందున అమరావతిలో భూమి కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరాం. అక్కడే ఆర్కివ్స్ పరిరరక్షణపై దృష్టి పెడతాం. ఆర్కీవ్స్ పై శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తాం. టెక్నాలజీ జోడించి, ఆర్కివ్స్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం అన్నారు..
స్పెషల్ నీడ్స్ పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ..
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలను ప్రతిపాదించామని మంత్రి లోకేష్ వెల్లడించారు. స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారని.. వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు కొన్ని రూ.50 వేలు కూడా వసూలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పరంగా పాఠశాలల ఏర్పాటుకు ముందుకు వెళుతున్నామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రస్తావించారు. స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని.. అప్పుడే వారి కాళ్లపై వాళ్లను నిలబట్టడానికి అవకాశమేర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.