AP | అందుకు రెడీగా ఉండాలి… : సీఎం చంద్రబాబు

AP | అందుకు రెడీగా ఉండాలి… : సీఎం చంద్రబాబు

  • 2027 గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది భక్తులు వ‌చ్చే అవ‌కాశం..

అమరావతి: 2027 గోదావరి పుష్కరాల వేళ ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ ఉండబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈసారి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దాదాపు 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 1991లో 1.2 కోట్ల మంది, 2003లో 5 కోట్ల మంది, నవ్యాంధ్రలో 2015లో 4.86 కోట్ల మంది భక్తులు వచ్చారని గుర్తు చేశారు. గతంలో ఒక్క రోజులోనే అత్యధికంగా 58.26 లక్షల మంది రాగా.. ఈసారి మాత్రం ఒక్క రోజులోనే కోటి మంది వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా కంటింజెన్సీ ప్లాన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం!

ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు. భక్తులందరికీ ఎంతో సెంటిమెంట్‌గా మారిన పోలవరం ప్రాజెక్టును ఈ 2027 గోదావరి పుష్కరాలకు ముందే ఎలాగైనా పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల పుష్కరాల శోభ మరింత రెట్టింపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.