- తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కోరిన ఏపీ కాంగ్రెస్ నేతలు…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో నిర్మంచ తలపెట్టిన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి తమవంతుగా సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు కోరారు. ఓర్వకల్లు మండలంలోని గ్రీన్ కో పవర్ ఎనర్జీ ప్రాజెక్టు సందర్శన నిమిత్తం శనివారం ఆయన కర్నూలుకు రాగా స్థానిక టోల్గేట్ సమీపంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితులు గిడుగు రుద్రరాజుకి నంద్యాల డిసిసి అధ్యక్షులు జే లక్ష్మీ నరసింహ యాదవ్, కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాష ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
నంద్యాల జిల్లా పిన్నాపురం సోలార్ పవర్ ప్లాంట్ పర్యవేక్షణకు కర్నూల్ మీదుగా వెళుతున్న భట్టి విక్రమార్కకు ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పూలమాలలతో, శాలువాలతో ఘనంగా స్వాగత సన్మానం పలికారు. ఈ సందర్భంగా గుండ్రేవుల ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కష్టాలు తీరుతాయని ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు.
స్వాగతం పలికిన వారిలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేంద్ర నాయుడు, నంద్యాల డిసిసి ప్రధాన కార్యదర్శి రజాక్ వలి కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, జిల్లా కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు పోతుల శేఖర్, ఐ ఎన్ టి యుసి ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఈ లాజరస్, కర్నూల్ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు బి హైమావతి, గోవిందు, తిరుపాలు శ్రీనివాసులు మొదలగు నంద్యాల కర్నూల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.