AP | వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా మార్కుల పరిశీలన

AP | వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా మార్కుల పరిశీలన


AP | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తమ ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.

విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌, ఇతర అవసరమైన వివరాలు నమోదు చేసి ఫలితాలను పరిశీలించవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా మార్కులు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈసారి సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 59 శాతం మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో 53 శాతం మంది తమ పనితీరును మెరుగుపరుచుకున్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.