ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ పత్రాల అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ పత్రాల అందజేత

భవానిపురం, ఆంధ్రప్రభ
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ఓసీ (లేటర్ ఆఫ్ క్రెడిట్) ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య,
మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు, టీడీపీ నాయకులు పీవీ కాంతారావు, కూటమి నేతలతో కలిసి అందజేశారు.

40వ డివిజన్, బ్యాంకు సెంటర్ కు చెందిన పీ రాజ్యం 52 హేమోరాయిడ్స్ సమస్యతో బాధపడుతూ వైద్యం సాయం కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 2 లక్షల 25 వేల ఎల్ఓసీ పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply