వైసీపీ మెలోడీ డ్రామా చాలు

వైసీపీ మెలోడీ డ్రామా చాలు

-వైసీపీ నేతల ఆరోపణలు అవాస్తవం
-మంత్రి టీజీ భరత్‌పై దుష్ప్రచారం మానుకోవాలి: గుడిసె ఆది కృష్ణమ్మ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలో వైసీపీ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రజలకు వినోదంగా మారిందని, మంత్రి టీజీ భరత్‌పై చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు.

శుక్రవారం కర్నూలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, సహకార సంస్థ ఛైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆగిపోగు ప్రభాకర్, డీసీఎంఎస్ ఛైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, జిల్లా న్యాయ విభాగం అధ్యక్షుడు కేఈ జగదీష్, రాష్ట్ర నాయకులు దాసిట్టి శ్రీనివాసులు, జయలక్ష్మీదేవి భారతి, కాశీ విశ్వనాథ్, ఎస్. సుబాన్ తదితరులు పాల్గొన్నారు.

నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నిర్వహించిన ధర్నాలో మంత్రి టీజీ భరత్‌పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజా సేవకు కట్టుబడి కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్న టీజీ భరత్‌పై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుష్ప్రచారమేనని పేర్కొన్నారు.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఇప్పుడు నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. బైరెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్ బైరెడ్డి శబరి ప్రజా సేవతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంటే, అదే కుటుంబానికి చెందిన సిద్ధార్థరెడ్డి వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో నిలవడం బాధాకరమన్నారు.

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత అసహనంతో వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు నిరాధార విమర్శలకు దిగుతున్నారని అన్నారు.

రాబోయే రోజుల్లో ప్రజలు వైసీపీకి రాజకీయంగా గుణపాఠం చెబుతారని, అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ విభాగ నాయకులు కేఈ జగదీష్, ఆగిపోగు ప్రభాకర్, దాశెట్టి శ్రీను మాట్లాడుతూ.. మంత్రి టీజీ భరత్‌పై చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో పరువు నష్టం దావా సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ పాలనలో గంజాయి, ఇసుక, మద్యం, మైనింగ్, భూ అక్రమాలు పెరిగాయని, ప్రజలు అందుకే గత ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించారని విమర్శించారు. టీజీ భరత్‌పై దుష్ప్రచారం నిలిపివేసి చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పద్మలతారెడ్డి, మహిళా అధ్యక్షురాలు ముంతాజ్, నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, స్వామిరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జకియా అన్సారీ, నంది మధు, రాజశేఖర్ రెడ్డి, హనుమంతరావు చౌదరి, శేషు యాదవ్, ప్రమోద్ రెడ్డి, సి.ఎస్. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply