సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలం సింగరాయపాలెం గ్రామంలో శ్రీ సద్గురు సాయి సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాములవారి కళ్యాణ మహోత్సవంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేసాడు శ్రీరామచంద్రుడు పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారాతెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామని వాడవాడలా జరిగే శ్రీరామనవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని తెలియజేసారు…

ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు భక్తులు మహిళలు పాల్గొన్నారు.
