Telangana Govt | ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజలకే అంకితం!

Telangana Govt | ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజలకే అంకితం!
Telangana Govt, ఉమ్మడి ఖమ్మం, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పై సాపైసా పోగు చేసి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నదని, నిరంతర అభివృద్ధి కోసమే తమ అడుగులు పడతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti vikramarka) పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకే అంకితమని, దోపిడీదారులను దళారులను దగ్గరకు రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా శనివారం వైరా నియోజకవర్గ కేంద్రంలో రూ.400 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2047 సంవత్సరం కల్లా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి వెళ్లనున్నదని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్ అని, విద్యతోనే సామాజిక మార్పు జరగడంతో పాటు సమాజాభివృద్ధి చెందు తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్కూల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.
స్కూలు లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు కూడా అందులోని నివాసం ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు లిటరరి యాక్టివిటీస్ పాటు క్రీడల్లో కూడా వారిని ప్రోత్సహి స్తామన్నారు. బహుశా భారత దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కూళ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. వైరా నియోజకవర్గంలో చేపడుతున్న ఈ స్కూలు నిర్మాణం కోసం ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో రూ.30 కోట్ల నిధులను జమ చేశామని, ప్రతి 15 రోజులకు ఒకసారి నిధులు విడుదల చేస్తామన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆనాటి బీఆర్ఎస్ పాలకులు రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్, కాస్మోటిక్ చార్జీలు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సరైన పోషకా హారం కూడా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డైట్ కాస్మెటిక్ ఛార్జిలు పెంచడమే కాకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు అందేలా నిష్ణాతులైన వారితో ఆయా పాఠశాలల్లో డిస్నే పెట్టించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1కోటి 15 లక్షల కుటుంబాలు ఉంటే… అందులో కోటి మంది మహిళలకు ఆత్మ గౌరవం ఉండేలా నాణ్యమైన చీరలను అందించడానికి శ్రీకారం చుట్టామన్నారు.
వైరా (Vyara) నియోజకవర్గానికి ఒక్కరోజులోనే రూ. 400 కోట్ల నిధులు.. వైరా నియోజకవర్గానికి ఒక్కరోజులోనే రూ. 400 కోట్ల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఆరంభం మాత్రమేనని నిరంతరం కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంతో తనకెంతో అనుబంధం ఉందని, విడదీయరాని బంధం ఉందని, ప్రతి ఊరు ప్రతి మనిషి వారి సమస్యలు అన్నీ తనకు తెలుసన్నారు. బహిరంగ సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, పోలీస్ కమిషనర్ సునిల్ దత్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి
https://epaper.prabhanews.com
