AP | రేపే జాతీయ ఇంధన సామర్థ్య సదస్సు..

  • బీఈఈ-ఇండో-జర్మన్‌ భాగస్వామ్య సమావేశానికి ఏపీ ఆతిథ్యం
  • ఏపీ ఎస్‌ఈసీఎం సహా ఎస్‌డీఏల ఉత్తమ పద్ధతుల ప్రదర్శన
  • ఇంధన సామర్థంలో గణనీయమైన పెట్టుబడులను అంచనా వేస్తున్న బీఈఈ

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) జాతీయ ఇంధన సామర్థ్య సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 20, 21 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. బీఈఈ-ఇండో-జర్మన్‌ భాగస్వామ్యంతో జరిగే ఈ సదస్సులో స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీ ఎస్‌ఈసీఎం) సహా పలు స్టేడ్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీస్‌ (ఎస్‌డీఏ)లు పాల్గొననున్నాయి.

ఇంధన సామర్థం ద్వారా ఇంధన స్థితిస్థాపకతను పెంపొందించడానికి, ఇంధన స్థిరత్వాన్ని వేగవంతం చేయడానికి వ్యూహాత్మక చర్యలో భాగంగా బీఈఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు నియమించిన ఏజెన్సీల పాత్రను బలోపేతం చేయడానికి ఈ వేదిక ఉపకరించనుంది.

ఈ సదస్సు ద్వారా రాష్ట్రస్థాయిలో జాతీయ కార్యక్రమాల అమలు చేయాలని బీఈఈ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్బన్‌ ఉద్గారాలను తగ్గింపునకు గల అవకాశాలపై మేథోమథనం చేసేందుకు ఉపయోగపడనుంది.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల నుండి ఉత్తమ ఇంధన సామర్థ్య పద్ధతులను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply