SWAMI | అయ్యప్ప మాల తో సకల సౌభాగ్యాలు…

SWAMI | అయ్యప్ప మాల తో సకల సౌభాగ్యాలు…
SWAMI | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : అయ్యప్ప మాలతో సకల సౌభాగ్యాలు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని బిక్కనూర్ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి శివం స్వామి తో పాటు గురుస్వామి వెంకటసుబ్బారావు అన్నారు. గురువారం మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన సుమారు 30 మంది అయ్యప్ప మాల ధరించారు. వారికి గురు స్వామి వెంకట సుబ్బారావు (Guru Swami Venkata Subbarao) ఆధ్వర్యంలో అయ్యప్ప మాలలు వేశారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు 41 రోజులు కఠోర దీక్షతో స్వామివారికి నిత్య పూజలు అందించాలని చెప్పారు. దానివల్ల కోరిన కోరికలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒకరికి ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గురుస్వామికి పాదాభివందనాలు చేశారు.
