Adoni హోంగార్డులు అంకితభావంతో సేవలందించాలి

Adoni హోంగార్డులు అంకితభావంతో సేవలందించాలి

  • సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్

ఆదోని (Adoni), ఆంధ్రప్రభ:

హోంగార్డులు క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆదోనిలో పర్యటించిన ఆయన హోంగార్డుల పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం విధుల నిర్వహణ, క్రమశిక్షణ, సంక్షేమం, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల్లో పోలీసు శాఖ పట్ల విశ్వాసం పెంపొందేలా సేవలందించాలని కోరారు. హోంగార్డులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

హోంగార్డుల సంక్షేమం, సేవా ప్రమాణాల మెరుగుదలపై కూడా పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే ప్రజల ప్రశంసలతో పాటు శాఖ గౌరవం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, ఆర్‌ఐ పోతల రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply