చిరంజీవి యువత నర్సాపురం అధ్యక్షుడిగా అడ్డాల రమేష్‌

నర్సాపురం, ఆంధ్రప్రభ: చిరంజీవి యువత నర్సాపురం పట్టణ అధ్యక్షుడిగా అడ్డాల రమేష్‌ ఎన్నికయ్యారు. స్థానిక మండా సత్యనారాయణ మూర్తి కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన చిరంజీవి యువత పట్టణ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీలో అధ్యక్షుడిగా అడ్డాల రమేష్‌, ఉపాధ్యక్షుడిగా మాట్ల సూర్య, కార్యదర్శిగా యాతం మహేష్‌, సహాయ కార్యదర్శులుగా అడబాల నాని నందన్‌, మురపాక శ్రీరామ్‌, కోశాధికారిగా వలబురెడ్డి రామకోటి నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోపల్లి శ్రీనివాస్‌, పొలిశెట్టి సాంబ, గుగ్గిలపు శివరామకృష్ణ, చెన్నంశెట్టి నాగు, పిల్లా శ్రీవారి, కొణిదల శ్రీను, కర్నేని లక్ష్మీనారాయణ, జక్కం చిన్న, తెలగంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.