దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈనెల 25 నుంచి 27 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 25వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ వరకు దేవరకొండ బస్ స్టేషన్ నుంచి బస్సులు నడుస్తాయని, డిపో పరిధిలోని ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేవరకొండ నుంచి శ్రీశైలానికి పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.210 చార్జీలు ఉంటాయని తెలిపారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం మన రాష్ట్ర సరిహద్దు పాతాళగంగ వరకు వర్తిస్తుందని తెలిపారు.