Rally | స్వచ్ఛ సంక్రాంతిపై ర్యాలీ

Rally | కంకిపాడు – ఆంధ్రప్రభ : కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సెంటర్ లో రెవెన్యూ, పోలీసు అధికారులు స్వచ్ఛ – సంక్రాంతిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. తహశీల్దార్ భావన్నారాయణ, అదనపు ఎస్ఐ తాతాచార్యులు, సర్పంచ్ పందిపాటి ఇందిర ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కోడిపందేలు వేయడం, జూదం ఆడటం, చట్టరీత్యా నేరమని, వక్తలు ప్రసంగించారు.
