Sukhender Reddy | కృతజ్ఞతలు..

Sukhender Reddy | కృతజ్ఞతలు..
- శాసన మండలి చైర్మన్ ను కలిసిన ఉద్యమకారులు
Sukhender Reddy | హైదరాబాద్ బ్యూరో చీఫ్, ఆంధ్రప్రభ : నల్గొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని 1969 ఉద్యమకారుల సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ శాసన మండలిలో తమ సమస్యలను ప్రస్తావించి , ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంగా సుఖేందర్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

1969 ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం , గౌరవ పెన్షన్ అందించాలని , అలాగే వారికి ఉచిత వైద్యసదుపాయాలు కల్పించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలిలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆయన లేఖ కూడా రాశారు.

1969 ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రాహరి రామరాజు ,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ గుత్తా సుఖేందర్ రెడ్డి కి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నరేంద్రుని విద్యాసాగర్ , ఈగ వెంకటేశ్వర్లు , కొత్తూరు వెంకటేశ్వర్లు , జగిని దయనంద్ , మెట్టపల్లి శంకరయ్య ,కుక్కడం మల్లయ్య , బంధు రుద్రమ్మ , చిత్రం భద్రమ్మ , తదితరులు పాల్గొన్నారు.
