Venkatesh | కాంబినేషన్ అదిరిపోతుంది – చిరు

Venkatesh | కాంబినేషన్ అదిరిపోతుంది – చిరు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌(Family Entertainment) మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమాతో చిరు, వెంకీ ప్రేక్షకులను అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు(Movie promotions) అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్(Prerelease event) నిర్వహించారు.

Venkatesh | ఆ.. బాధ్యత మీది

Venkatesh

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది(Telugu film industry) అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా.. అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్(Super hit for Sankranthi) అవ్వాలని, తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను. అలంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్(Every movie is perfect) సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి.

Venkatesh | అవి తీపి జ్ఞాపకాలు..

Venkatesh

రాఘవేంద్రరావు గారు, అనిల్ తో నేను సినిమా చేస్తే అది అదిరిపోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్(Clap the movie) కొట్టి ప్రారంభించారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు .. ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్(Heart touching scenes) ఉన్నాయి .ఈ సినిమాని వైవిధ్యంగా చేస్తామని తనతో చెప్తే…’ ఎలాంటి వైవిధ్యం వద్దండి.. దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు అన్నయ్య, చంటబ్బాయి… ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో నాకు అలా ఉంటే చాలు అన్నారు. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్దవాళ్ళు అయిపోయారు. అవి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్(The current generation) కి అవి మీరు ఎలా చేస్తారు కూడా తెలియకపోవచ్చు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే నా ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను సరే అన్నాను.

Venkatesh | నేను ఎమోషనల్ అయ్యాను..

Venkatesh

అలా చేయడం నాకు కేక్ వాక్. చాలా చక్కటి హోం వర్క్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా సీన్స్ ని డిజైన్ చేస్తూ(Designing scenes) వచ్చారు. తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగింది. అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్(Create a positive atmosphere) చేశారు. ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్ లాగా చేయగలరు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్‌ విషయంలోనూ అనిల్‌ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు అన్నారు.

Venkatesh | చిన్న సైజు గురువు..

Venkatesh

ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. బడ్జెట్ లిమిట్లో(Within budget limits) చేసాం. డేస్ పరంగా అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో అత్యద్భుతంగా తీగలిగాం. అనుకున్న బడ్జెట్లో అనుకున్న రోజుల్లో సినిమాచేయగలగడం ఒక సినిమాకి మొదటి సక్సెస్. రెండో విజయం 12 తారీఖున ఎంత ఘన విజయం ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. నా తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్(Positive person). తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్ గా అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో(Still photo) దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా ఎన్నాళ్లకు అది కుదిరింది.

Venkatesh | అదే స్ఫూర్తితో..

Venkatesh

నయనతార ఈ సినిమా కోసం తను కూడా మాకు కుటుంబ సభ్యురాలు లాగా కలిసిపోయింది. ఈ సినిమాలో నయనతార కనిపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. తను అద్భుతంగా నటించి మెప్పించింది. నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్(Perform wonderfully) చేశారు. వాళ్లందరికీ నా అభినందనలు. ఈ సినిమాకి భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఒక గోదావరి పడవ ప్రయాణం లాగా ఉండే మ్యూజిక్ ఇచ్చాడు. మీసాల పిల్ల సాంగ్ వంద మిలియన్ పైగా హిట్ ఇచ్చింది. పాటలో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో హుక్ స్టెప్ సాంగ్ కంపోజ్(Hook Step Song Compose) చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. థియేటర్లో ఆ సాంగ్ టోటల్ గా హైలైట్ అవుతుంది. ఆ సాంగ్ వింటున్న వెంకటేష్ ఎదురుగా డాన్స్ వేశారంటే అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను. ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్(Music by Bheems) కి అభినందనలు. నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి లోకి వస్తారని నాకు తెలుసు. ఇదే అభిమానం ప్రేమ మీరు ఎప్పుడూ నా మీద చూపించాలి. థాంక్యూ సో మచ్. ఐ లవ్ యు ఆల్ అన్నారు.

Venkatesh | సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి..

Venkatesh

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్(Wonderful experience). ఇది మామూలుగా లేదు. ఆయన రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే. నేను మా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ తో మహేష్ తో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్ తో నాది వండర్ఫుల్ కాంబినేషన్(Wonderful combination). అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు. తన రైటింగ్ టీం. టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్(Sankranthi Films) అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ అన్నారు.

CLICK HERE TO READ బన్నీ నెక్ట్స్ మూవీ పిక్స్..?

CLICK HERE TO READ MORE

Leave a Reply