Janagama | స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్

Janagama | స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్

Janagama | జనగామ, ఆంధ్రప్రభ : అధికారం పోయిన అహంకారం తగ్గని కేటీఆర్ తుపాకీ వెంకట్రాముడీ అవతారమెత్తి ఏది పడితే అది మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన గుణపాఠం చెప్తారని పీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ రాహుల్ గాంధీని లీడర్ కాదు – రీడర్ అని వ్యాఖ్యానించడం ఆయన రాజకీయ అవగాహన లేనితనానికి నిదర్శనమని అన్నారు.

ఈ సమావేశంలో పిసిసి సభ్యులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి , డీసీసీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మార్కెట్ ఛైర్మెన్ బనుక శివరాజ్ యాదవ్, మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, వేమల్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు, డాక్టర్ రాజమౌళి,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వంగాల కళ్యాణి , సేవాదళ్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి,అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్, మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, వగలబోయిన యాదగిరి, ఆర్ టి ఎ మెంబర్ అభి గౌడ్, దిశా సభ్యులు బక్క శ్రీను, ఛైర్మెన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, కాగితాపురం మహేందర్ రెడ్డి, సర్వల నర్సింగ రావు, జిల్లెల్ల సిద్ధారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి వంగాల మల్లారెడ్డితదితరులు పాల్గొన్నారు.

Leave a Reply