Congratulated | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్…

Congratulated | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్…
- వెన్నెల, శ్రీ నిత్యలను అభినందించిన పోలీస్ కమిషనర్
Congratulated | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కూచిపూడి నృత్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన బెల్లంపల్లి పట్టణానికి చెందిన విద్యార్ధినీలు వేముల వెన్నెల, వేముల శ్రీనిత్యలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ రోజు అభినందించారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ కారుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆస్ట్రాలజీ వాస్తులో డాక్టరేట్ పొందిన వేముల శ్రీనివాస్, గృహిణి వేముల మానసల ఇద్దరు కూతుళ్లు పట్టుదలతో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొని ఆ నృత్యంలో ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. పట్టుదల ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవచ్చన్నారు. చదువుతోపాటు నృత్యంలో ఇద్దరు విద్యార్థులు రాణించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా సీ పీ విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించి ప్రశంసించారు.
