Special train | కడప ఇజ్తిమకు ప్రత్యేక రైలు..

Special train | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని కడపలో జరగబోయే ఇజ్తిమ కొరకు నంద్యాల మీదుగా స్పెషల్ ట్రైన్ దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు,డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం తెలిపారు. కడపలో ఇజ్తిమ జనవరి 23 నుండి 25 వరకు జరగబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఇజ్తిమకు హాజరవుతారన్నారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పెషల్ ట్రైనీ నడుపుతున్నారనీ తెలిపారు. రైలు నెంబర్ 07140 చర్లపల్లి _తిరుచానూరు 22 వ తేదీ చర్లపల్లిలో బయలుదేరి వయా నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా నంద్యాలకు 23 వ తేదీ ఉదయం 5:30 కు వచ్చి కడపకు బయలుదేరి, మళ్ళీ రేణిగుంట మీదుగా తిరుచానూరు చేరుకుంటుందన్నారు.

రైలు నెంబర్ 07141 తిరుచానూరులో 25 జనవరి రాత్రి 11:30 కు బయలుదేరి కడపకు ఉదయం 3 గంటలకు చేరుకొని, నంద్యాలకు ఉదయం 6:50 చేరుకొని గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి వెళ్లనుందన్నారు. నంద్యాల నుండి కడపకు ఇజ్తిమకు వెళ్ళే భక్తులకు ఈ రైలు చాలా ఉపయోగ పడుతుందనీ ఎంపీ తెలిపారు. దీని ఇజ్తిమకు రాను పోను కోసం ఈ స్పెషల్ ట్రైన్ వేసిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు నంద్యాల తరఫున అభినందనలు తెలిపారు. ముస్లిం సోదరులు ఈ ప్రత్యేక రైలును సద్వినియోగం చేసుకోవాలని ఎంపి కోరారు.
