Toxic | అంచనాలు పెంచేసిన రుక్మిణి వసంత్..

Toxic | అంచనాలు పెంచేసిన రుక్మిణి వసంత్..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా నుంచి వస్తోన్న క్రేజీ అప్‌డేట్స్(Crazy updates)తో అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. గీతూ మోహన్ దాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్(The makers have released the look poster) చేశారు. ఇంతకీ.. ఈ పోస్టర్ ఎలా ఉంది.? టాక్సిక్ వచ్చేది ఎప్పుడు..?
Toxic | అంతర్జాతీయ స్థాయిలో..

రుక్మిణి వసంత్ పోస్టర్ చూస్తుంటే.. ఆమె అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే పాత్రలో కనిపించనుందనే విషయం తెలుస్తోంది. యష్, గీతూ మోహన్ దాస్ కాంబో(Yash and Geethu Mohandas combo) అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు యష్‌తో కలిసి రుక్మిణి వసంత్ నటించటంతో ఇదింకా ప్రత్యేకతంగా అనిపిస్తోంది. డైరెక్టర్ గీతు కథలో చెప్పాలనుకున్న డెప్త్, సీరియస్‌నెస్ అర్థం చేసుకుని తనదైన నటనతో భావోద్వేగాలను అద్బుతంగా పలికించేలా సహజంగా ఒదిగిపోయే నటి రుక్మిణి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో(At the international level) నిలిచిపోయేలా ఓ ఇండియన్ సినిమా చేయాలనే యష్ ఆశయం కూడా ఇందులో ప్రతిబింబిస్తుంది.
Toxic | మెల్లిసా పాత్ర ఆత్మవిశ్వాసంతో..

నాడియాగా కియారా అద్వానీ, ఎలిజిబెత్ పాత్రలో హుమా ఖురేషి, గంగ రోల్‌లో నయనతార, రెబెకా క్యారెక్టర్‌లో తారా సుతారియా నటిస్తున్నారు. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల(Looks released) తర్వాత టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్ నుంచి మెల్లిసా పాత్రలోని రుక్మిణి వసంత్‌ను పరిచయం చేయటం చూస్తే.. ఈ కథా ప్రపంచం మరింత డెప్త్‌గా ఉందనే విషయం తెలుస్తుంది. 1960 చివరలో జరిగే రంగుల ప్రపంచంలో తక్కువ వెలుతురుండే ప్రదేశంలో జరుగుతున్న పార్టీ నేపథ్యంలో ఈ సన్నివేశం ఉంటుంది. మెల్లిసా పాత్ర ఆత్మవిశ్వాసంతో(Melissa’s character is confident) ఉంటుంది. ఆమె చూపులో.. ఓ తీక్షణతను చూడొచ్చు. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం పక్కనున్న వారిని పట్టించుకోకుండా తేలిపోతుంటే, మెల్లిసా మాత్రం తన లక్ష్యం వైపు చాలా స్పష్టంగా అడుగులేస్తుంటుంది. అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించేలా ఆమె నడక ఉంది. ఇది ఎంత బావుంటుందంటే.. ఆ ప్రదేశమంతా ఆమె ఆధీనంలోనే ఉన్నంతగా.
Toxic | నా నిర్ణయాలను ప్రశ్నించుకునేలా..

ఈ సందర్భంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Director Geetu Mohan Das) మాట్లాడుతూ.. రుక్మిణిలో నాకు నచ్చే విషయమేమంటే.. నటిగా డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలని ఆలోచించే వ్యక్తి కాదు. చాలా తెలివైనది. పాత్రను అర్థం చేసుకుంటుంది. పాత్ర గురించి ఆమె వేసే ప్రశ్నలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. డైరెక్టర్‌గా అవి నన్నెంతో ఆలోచింపచేశాయి. కొన్ని సందర్భాల్లో నా నిర్ణయాలను ప్రశ్నించుకునేలా చేశాయి. ఆమె నటిస్తున్నప్పుడు స్క్రీన్‌ను చూస్తే ఆమె ఎంత తెలివైనది.. మనం చెప్పని విషయాలను కూడా ఇంప్రవైజ్(Improvise) చేసి చెబుతుందనిపిస్తుంది. షూటింగ్ షాట్స్ గ్యాప్‌లో ఆమె నిశ్శబ్దంగా తన జర్నల్‌లో రాసుకోవటాన్ని నేను చాలా సార్లు చూశాను.

సెట్‌లో జరిగిన చిన్న సంఘటనలు, తన ఆలోచనలను ఆమె అందులో రాసుకుంటుంటుంది. ఇదే ఆమె యాక్టింగ్(She is acting) వెనుకున్న రహస్యమని తెలుస్తుంది. ఆమె తనతో తాను ఓ లోకాన్ని నిర్మించుకుంటూ ఉంటుంది. ఆమె పని చేసే తీరు ఆలోచనాత్మకంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె జర్నల్(Her journal)లో పేజీలను మనం ఒక్కసారి చదివితే బావుండేదనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నటనలోని డెప్త్.. ఆపాత్ర వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తి అందులోనుంచి వచ్చిందే’’ అన్నారు. ఈ సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్(Grand theatrical release)కు సిద్ధమవుతోంది అన్నారు.
