Suresh Kalmadi | కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Suresh Kalmadi | కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Suresh Kalmadi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ (Suresh Kalmadi) (81) అనారోగ్యంతో ఇవాళ‌ పుణెలో కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

పీవీ నరసింహారావు (PV Narasimha Rao) ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కల్మాడీ, భారత ఒలింపిక్ సంఘం (Indian Olympic Association) అధ్యక్షుడిగా, 2010 దిల్లీ కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కీలక సేవలందించారు. 1964 నుంచి 1972 వరకు భారత వాయుసేనలో పైలట్‌గా పనిచేసిన ఆయన, 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. కల్మాడీ మరణం రాజకీయ, క్రీడా వర్గాల్లో విషాదం నింపింది. ఆయన సేవలు దేశానికి ఎప్పటికీ స్మరణీయమని పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply