Multi specialty | కారేపల్లిలో వైద్య శిభిరం ఏర్పాటు …

Multi specialty | కారేపల్లిలో వైద్య శిభిరం ఏర్పాటు …
Multi specialty | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని కారెపల్లి గ్రామంలో ఆదివారం అశ్విని రెడ్డి మల్టీ స్పెషాలిటీ(Multi specialty) హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు భూక్యా చంద్రునాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రామావత్ తుక్కాజీ నాయక్ వినతి మేరకు ఈ శిభిరం ఏర్పాటు చేశారు.
ఈ శిభిరంలో గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.అవసరం ఉన్నవారికి వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. గిరిజన గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేసి సేవలు అందజేసిన హాస్పిటల్ వారికి గిరిజన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బంజారా సేవా సంఘం భీమ్‌గల్ మండల అధ్యక్షులు బాధవత్ శర్మ నాయక్, సర్పంచ్ మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
