Award | బెస్ట్ టీచ‌ర్‌కు అవార్డు

Award | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంక జెడ్పీపాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అరవ సుజాతకు సావిత్రి బాయి పూలే సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర సంఘాలు పాల్గొని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply