Successful Director | అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా…?

Successful Director | అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా…?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి.. అపజయం ఎరుగని దర్శకుడు(A director who has never known failure). అంతే కాదండోయ్.. అతనిలో మాంచి నటుడు కూడా ఉన్నాడు. ఆ చలాకీతనం.. రియాల్టీ షోల్లో పంచ్ లు వేయడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో డ్యాన్సులు చేయడం.. ఇదంతా చూస్తుంటే.. అనిల్ హీరోగా సినిమా(Anil as the hero in the movie) చేయచ్చు అనే మాట వినిపిస్తుంది. అతన్ని చూసిన వాళ్లకు ఎవరికైనా అనిపిస్తుంది. అయితే.. డైరెక్టర్ టర్నడ్ హీరో అంటే.. ఎస్వీ కృష్టారెడ్డి గుర్తొస్తారు. మరి.. అనిల్ రావిపూడి మరో ఎస్వీ కృష్ణారెడ్డి కానున్నారా..? ఇంతకీ.. అనిల్ మనసులో ఏముంది..?
Successful Director | హీరోగా అనిల్ రావిపూడి..

అనిల్ రావిపూడి.. చూడడానికి హీరోలా ఉంటాడు. అంతే కాదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో(At pre-release events) చక్కగా డ్యాన్స్ కూడా చేస్తుంటాడు. అతనిలో మంచి డ్యాన్సర్ ఉన్నాడు. ఇది చాలా సార్లు బయటపడింది. అలాగే ఎలా నటించాలో ఆర్టిస్టులకు నటించి చూపిస్తాడు. ఆ విధంగా అతనిలో ఉన్న యాక్టర్ చాలా సార్లు(Actor many times) బయటపడ్డాడు.. అందుకనే అనిల్ రావిపూడిని మీడియా జనాలు హీరోగా ఎప్పుడు నటిస్తారు..? అని అడుగుతుంటారు. ఆయలో ఉన్న టాలెంట్ చూసి ఖచ్చితంగా అనిల్ రావిపూడి హీరోగా రాణిస్తాడు.. డైరెక్టర్ గా సక్సెస్ సాధించినట్టే.. హీరోగా కూడా సక్సెస్ సాధిస్తాడు అనే మాట అటు ఆడియన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ(Both in the audience and in the industry) వినిపిస్తుంది.
Successful Director | అనిల్ మనసులో మాట..

రీసెంట్ గా అనిల్ రావిపూడి(Recently, Anil Ravipudi) హీరోగా సినిమా ఎప్పుడు అనే మాట మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల గుంటూరులో జరిగిన మెగా విక్టరీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఈ ప్రస్తావన వచ్చింది. దానికి అనిల్ సమాధానం చెబుతూ.. మనం సక్సెస్ ట్రాక్ లో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయని, పక్కకు వెళ్ళామా అంతే సంగతులు అని చెప్పారు. అలాగని హీరోగా నటించను అని చెప్పలేదు. దీనిని బట్టి డైరెక్టర్ గా సక్సెస్(Success as a director) లో ఉన్నప్పుడు మాత్రం హీరోగా చేయను అన్నారంటే.. ఆతర్వాత హీరోగా చేసే ఛాన్స్ ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
Successful Director | అందుకే.. అనిల్ ఈ నిర్ణయం..

గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి ఏ రేంజ్ లో ఫామ్ లో(SV Krishna Reddy is in form in the A range) ఉన్నప్పుడు హీరోగా ఉగాది, అభిషేకం సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలు బాగానే ఉంటాయి కానీ.. ఆశించిన సక్సెస్ సాధించలేదు. ఆతర్వాత ఆయన హీరోగా కంటిన్యూ చేయలేదు. డైరెక్షన్ కు పరిమితమయ్యారు. డైరెక్టర్ వి.వి వినాయక్ కూడా హీరోగా సినిమా చేద్దామని ట్రై చేశారు. ఈ సినిమాని దిల్ రాజు(The film is directed by Dil Raju) నిర్మించాలి అనుకున్నారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఆపేశారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తెలివిగా కేవలం దర్శకుడిగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. మరి.. ఫ్యూచరల్ లో అనిల్ రావిపూడి హీరోగా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

