Congress Leaders | మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం

Congress Leaders | మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం

Congress Leaders | తొర్రూరు, ఆంధ్రప్రభ : రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అన్ని వార్డులను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన తొర్రూరు మున్సిపల్ పరిధిలోని 5, 7, 9, 11, 12 వార్డుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు కోట్లాది రూపాయలు మంజూరు చేసి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగొటి సోమేశ్వరరావు, చాపల బాపురెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, గుండాల నరసయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, ధరావత్ సోమన్న, వెంకటాచారి, గంజి దేవేందర్ రెడ్డి, దొంగరి రేవతి శంకర్, బిజ్జాల అనిల్, ముద్దసాని సురేష్, రాజేష్ యాదవ్, హేమంత్ నాయక్, దేవుడు, యూత్ పట్టణ అధ్యక్షుడు మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply