Bellary SP | ఎస్పీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…

Bellary SP | ఎస్పీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…

కర్ణాటక, ఆంధ్ర‌ప్ర‌భ : కర్ణాటక (Karnataka) లోని బళ్లారి నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు వివాదం ఘర్షణకు దారితీసి కాల్పులతో రణరంగంగా మారిన సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.

కర్ణాటకలోని బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన గొడవలు చివరికి ఎస్పీ ఆత్మహత్యాయత్యానికి కారణమైంది. ఈ ఘటన జరిగిన సమయానికే సరిగ్గా కొన్ని గంటల ముందు పవన్ నజ్జూర్ (Pawan Nejjur) బళ్లారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే, నగరంలో పరిస్థితిని అదుపు చేయడంలో వైఫల్యం చెందారని, ఉన్నతాధికారులకు సరైన సమాచారం చేరవేయలేదనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం ఆయనను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం (neglect) వహించారన్న కారణంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

సస్పెన్షన్ (Suspended) వేటు పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీ పవన్ నజ్జూర్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply