Vakiti Srihari | పట్టణ ప్రగతికి నిధులు

Vakiti Srihari | పట్టణ ప్రగతికి నిధులు
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి
Vakiti Srihari | మక్తల్, ఆంధ్రప్రభ : ప్రణాళికా బద్దంగా మక్తల్ పట్టణ ప్రగతికి (Maktal urban development) నిధులు కేటాయిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Dr.Vakiti Srihari) అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీరామ్ నగర్, రసమానియా కాలనీలో మీదుగా గుర్లపల్లి, వనాయకుంట గ్రామాలకు వెళ్లేరోడ్డు రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… శ్రీరామ్ నగర్ కాలనీ (Sriram Nagar Colony) రెహమానియా కాలనీతో పాటు గుర్లపల్లి వనాయకుంట గ్రామాలకు వెళ్లేదారి అధ్వాన్న స్థితిలో గుంతలమైన రోడ్డు కోసం ఈ ప్రాంత ప్రజలు గత 15 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారని, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. గతంలో లక్ష రూపాయల పని మంజూరైతే 10శాతం కమిషన్లు ఇస్తేనే పనులు ప్రారంభించే దుస్థితి ఉండేదన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.

అభివృద్ధి చేస్తుంటే పనీపాట లేని వారు ఏమో ఆరోపణలు (Accusations) చేస్తూనే ఉంటారని, అలాంటి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. స్థానికుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి తాను కట్టిపడి ఉన్నానని, దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా స్థానిక నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. అవసరమైతే అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.
అభివృద్ధి (Development) చేస్తుంటే కేసులు వేస్తున్న దుస్థితి ఉండటం చాలా బాధాకరమన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, కట్టా సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, బోయ రవికుమార్, మందుల నరేందర్, కావలి తాయప్ప, మేదరి శ్రీనివాసులు, బి.అమరేందర. రెడ్డి, నూరొద్దీన్, బి.శంషొద్దిన్, హుసామొద్దీన్, సాదిక్, సాలంబిన్ ఉమర్ బస్రవి, రవూఫ్ ,రహీం పటేల్, రంజాన్ ,మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, ఏఈ నాగశివ తదితరులు పాల్గొన్నారు.

