Prashanth Varma | జై హనుమాన్ నుంచి తేజ తప్పుకున్నాడా..?

Prashanth Varma | జై హనుమాన్ నుంచి తేజ తప్పుకున్నాడా..?
Prashanth Varma | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హనుమాన్.. సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ (Block Buster) సాధించింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉందని.. టైటిల్ జై హనుమాన్ అని ప్రకటించారు. ఈపాటికే జై హనుమాన్ థియేటర్స్ లోకి రావాలి కానీ.. ఇంత వరకు రాలేదు. అసలు షూటింగే స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి తేజ సజ్జ తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజంగానే తేజ సజ్జ తప్పుకున్నాడా..? అసలు జై హనుమాన్ సినిమా తెర వెనుక ఏం జరుగుతోంది…?

Prashanth Varma | జై హనుమాన్..
హనుమాన్ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా 2024లో జనవరి 12న రిలీజైంది. భారీ సినిమాల మధ్య చిన్ని సినిమాగా రిలీజైన హనుమాన్.. అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా (Movie) దాదాపుగా 350 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇద్దరికీ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ కు వెంటనే జై హనుమాన్ అంటూ సీక్వెల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఇంత వరకు జై హనుమాన్ పట్టాలెక్కలేదు.

Prashanth Varma | అసలు నిజం ఇదే..
హనుమాన్ సీక్వెల్ గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఈ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హనుమాన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే తేజ సజ్జ పాత్ర కూడా కీలకం. అయితే.. తేజ సజ్జ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రచారంలో వాస్తవం లేదని.. తేజ సజ్జ ఈ సినిమా నుంచి తప్పుకోలేదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే తేజ సజ్జ పాత్ర చాలా తక్కువుగా ఉంటుందని.. హనుమాన్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని తెలిసింది.

Prashanth Varma | కొత్త సంవత్సరంలో సెట్స్ పైకి..
రిషబ్ శెట్టి కాంతార 1 లో బిజీగా ఉండడం వలన ఇన్ని రోజులు ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు కాంతార 1 రిలీజైంది.. బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఇప్పుడు రిషబ్ శెట్టి ఫోకస్ అంతా జై హనుమాన్ పైనే ఉందని తెలిసింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసి.. రిషబ్ శెట్టి ఎప్పుడు ఓకే అంటే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ వర్మ (Prashanth Varmar) రెడీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ప్రశాంత్ వర్మ కొత్త సంవత్సరంలో ఈ క్రేజీ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. మరి.. హనుమాన్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్ తో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.

