Competitions | రాష్ట్ర‌ ఖో-ఖో పోటీలకు మాన్విక ఎంపిక

Competitions | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలకు చెందిన స్టూడెంట్ బాశెట్టి మాన్విక రాష్ట్ర ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిజామాబాద్ లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ ( U-14) ఖో-ఖో పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విద్యార్థినిని పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి, కమిటీ సభ్యులు ప్రధానాచార్యులు నర్సారెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply