Terrorist Attack | Panic | వెంటాడుతున్న భయం!

Terrorist Attack | Panic | వెంటాడుతున్న భయం!
- ఉగ్రదాడులపై అనుమానాలు
- హైదరాబాద్‌లో ఉగ్రవాద మూలలు
- న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Terrorist Attack | Panic | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నా, వాటి మూలాలు హైదరాబాద్‌లో కనిపించడం భాగ్యనగర వాసులను(The people of Bhagyanagara) భయకంపితులను చేస్తోంది. సుమారు 18 ఏళ్లు కిందట హైదరాబాద్ లుంబినీ పార్క్, గోకుల్ చాట్ బాంబు దాడుల చేదు జ్ఞాపకాల మరకలు ఇంత వరకు హైదరాబాద్ ప్రజల మనసుల్లోంచి చెరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హైదరాబాద్ సిటీపై ఉగ్రవాదులు(Terrorists on the city) విరుచుకు పడక పోయినా నాటి సంఘటన తాలూకూ భయం మాత్రం ఇంకా వెంటాడుతునే ఉంది. ఎక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడినా హైదరాబాద్ నగర వాసులు ఉలిక్కిడే పరిస్థితి నెలకొంది.
అదే క్రమంలో చాలా ఘటనలకు కారకులైన ఉగ్రవాదుల(The terrorists who caused the) మూలాలు ఇక్కడ ఉండడం ప్రజల భయాందోళనకు ఒక కారణం. షెల్టర్ జోన్‌గా ఉగ్రవాదులు హైదరాబాద్‌ను ఎంచుకుని ఉంటారని, అందువల్ల ప్రస్తుతానికి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడరని భావిస్తున్నా.. ఎప్పుడు ఏ రకంగా విరుచుకు పడతారో అనే అనుమానాలు లేకపోలేదు.
Terrorist Attack | Panic | ఆస్టేలియా ఘటన.. హైదరాబాద్‌లో మూలాలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బోండి బీచ్‌లో ఇటీవల సామూహిక కాల్పులు(Mass shooting) జరిగిన సంఘటన విదితమే. అయితే ఈ కాల్పులకు పాల్పడిన ఉగ్రవాది హైదరాబాద్‌కు చెందిన సాజిద్ అక్రమ్ అనే వ్యక్తిగా తెలంగాణ పోలీసులు గుర్తించారు. అతను 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి ఇక్కడకు రాలేదని కూడా పోలీసులు గుర్తించారు. భారతదేశం అంతటా పెద్ద ఎత్తున దాడులకు ఆయుధాలను(Weapons of attack) సరఫరా చేసే కుట్రలో భాగంగా గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) హైదరాబాద్ కు చెందిన ఒక కీలక వ్యక్తిని అరెస్టు చేసింది.
Terrorist Attack | Panic | మేలో ఉగ్రవాద కుట్ర భగ్నం…

హైదరాబాద్‌లో మే 2025లో పేలుళ్లకు ఒక పెద్ద ఉగ్రవాద కుట్ర(Terrorist conspiracy) జరిగినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కౌంటర్-ఇంటెలిజెన్స్ సెల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ద్వారా తెలుసుకున్నారు. అయితే ఉగ్రదాడి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సౌదీ అరేబియాలో ఐఎస్ఐఎస్ మాడ్యూల్తో సంబంధాలున్నాయని భావిస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు(Police arrested) చేశారు. అలాగే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో మే 2025లో పేలుళ్లకు ఒక పెద్ద ఉగ్రవాద కుట్ర జరిగినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కౌంటర్-ఇంటెలిజెన్స్ సెల్స్(Counter-intelligence cells) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ద్వారా తెలుసుకున్నారు. అయితే ఉగ్రదాడి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సౌదీ అరేబియాలో ఐఎస్ఐఎస్ మాడ్యూల్తో సంబంధాలున్నాయని భావిస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Terrorist Attack | Panic | న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో…

మహానగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో న్యూఇయర్(New Year in Hyderabad) వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నగర ప్రజలందరూ రోడ్లపై, పార్కుల్లో, పబ్‌లు, బార్లలో ఉంటారు. అయితే ఎప్పుడైనా ఉగ్రవాదులు జనాలు ఎక్కువ ఉన్న చోట టార్గెట్ చేస్తుంటారు. అలాగే న్యూఇయర్ సందడిలాంటి సామూహిక వేడుకలను(Mass celebrations) వేదికగా తీసుకుంటుంటారు. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదులు షెల్టర్ జోన్(Terrorists shelter zone) లో కూడా ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉంటారని నమ్మడానికి లేదు. వారు అక్కణ్ణుంచి మకాం మార్చేట్టయితే, ఆ ప్రదేశాన్ని అల్లకల్లోలం చేసి జారుకుంటారు.
Terrorist Attack | Panic | ప్రజల బాధ్యత..

అనుమానాస్పదంగా కనిపించే ఏ వస్తువులను, బ్యాగులనూ మనకెందుకులే అని వదిలేయకుండా, వెంటనే పోలీసులకు(Immediately to the police) సమాచారం అందించాలి. అలాగే అనుమానాస్పదంగా సంచరించే అపరిచిత వ్యక్తుల కదలికలపైనా ఓ కన్నేసి ఉంచాలి. వారు ధరించిన దుస్తులనూ, వారి చేతుల్లో ఉండే బ్యాగుల్లాంటి వాటినీ ఓసారి పరిశీలించాలి. ఎందుకంటే వారి దుస్తుల్లో, బ్యాగుల్లో(In clothes, in bags) ఆయుధాలున్నట్టయితే వారి కదలికల్లోనే తెలిసిపోతుంది. పోలీసులకైనా సమాచారం అందించవచ్చు, లేదా పరిసరాల్లోని ప్రజలకైనా తెలియజేయాలి. అందూవల్ల మరింతమందిని అప్రమత్తం చేసినట్టవుతుంది.
CLICK HERE TO READ పుల్లెంల చేరుకున్న మావోయిస్టు గణేశ్ మృతదేహం
