SDF funds | పూజారుల వసతి గృహం, అన్నదాన సత్రం ప్రారంభం

SDF funds | పూజారుల వసతి గృహం, అన్నదాన సత్రం ప్రారంభం

  • ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

SDF funds | రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన పూజారుల వసతి గృహం, అన్నదాన సత్రంలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాక సామాజిక సేవకు నిలయాలుగా ఉండాలని తెలిపారు. పూజారుల సౌకర్యార్థం వసతి గృహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే భక్తులకు అన్నదానం అందించే సత్రం ద్వారా సేవాభావం మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పూజారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సదుపాయాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply