Collectorate | అవకాశాలిస్తే అద్భుతాలే..

Collectorate | అవకాశాలిస్తే అద్భుతాలే..

  • జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

Collectorate | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : బాలలకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి అద్భుతాలు సృష్టించగలరని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీర్ బాల్ దివస్ – 2025 కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు వీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తైన బాలలలో ధైర్యం, త్యాగం, దేశభక్తి విలువలను నాటడమే వీర్ బాల్ దివస్ ఉద్దేశ‌మని పేర్కొన్నారు. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు — 9 ఏళ్ల జోరావర్ సింగ్, 5 ఏళ్ల ఫతేసింగ్‌లు దేశ గౌరవం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగాన్ని స్మరించుకునే రోజుగా 2022 నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు.

Collectorate

ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా వీర్ బాల్ పురస్కారం అందుకున్న వారిలో కర్నూలు జిల్లా మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ హెచ్‌యూ. శివాని ఉండటం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ అభినందించారు. ఆమె సాధించిన విజయాలు జిల్లాలోని బాలబాలికలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. బాలలకు అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని మరోసారి స్పష్టం చేశారు.

Collectorate

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ జుబేదాబేగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. భాస్కర్, బాలల పరిశీలన గృహాల సూపరింటెండెంట్ తదితర అధికారులు పాల్గొన్నారు.
“అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టించగలరు” అన్న సందేశాన్ని బాలలందరిలో నాటడమే వీర్ బాల్ దివస్ స్ఫూర్తి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

Collectorate

Leave a Reply