Andhra King Taluka | రామ్.. సరికొత్త ప్రయత్నం..

Andhra King Taluka | రామ్.. సరికొత్త ప్రయత్నం..

Andhra King Taluka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎనర్జిటిక్ హీరో అంటే.. ఠక్కున గుర్తొచ్చేది రామ్. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొత్త తరహా సినిమాలు చేయాలని తపించారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే.. ఈమధ్య కాలంలో రామ్ మాస్ ప్రయత్నం చేయాలని తపిస్తున్నాడు కానీ.. సక్సెస్ (Success) మాత్రం రావడం లేదు. అందుకనే.. విజయం కోసం.. సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. ఇంతకీ.. రామ్ ఏం చేయబోతున్నాడు..? ఈసారైనా ఆశించిన విజయం అందించేనా..?

Andhra King Taluka

Andhra King Taluka | ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్..

దేవదాసు సినిమాతో రామ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ (Block Boster) సొంతం చేసుకున్నాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఆతర్వాత సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన జగడం సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించినా.. వయసు చిన్నది.. ఆ పాత్ర పెద్దది అనే టాక్ వచ్చింది. నటుడుగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆతర్వాత రెడీ, మస్కా, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, ఎందుకంటే.. ప్రేమంట… ఇలా వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు ఈ ఎనర్జిటిక్ హీరో.

Andhra King Taluka

Andhra King Taluka | అదరగొట్టిన ఇస్మార్ట్ రామ్..

పండగ చేసుక్కో, నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ (Love) కోసమే.. ఇలా క్లాస్ మూవీస్ తో మెప్పించిన రామ్.. మాస్ లో మెప్పించాలని తపించాడు. కరెక్ట్ గా అలాంటి టైమ్ లోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశారు. రామ్ కోరుకున్నట్టుగా ఊర మాస్ లుక్ లో చూపించడంతో మాస్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. బాక్సాపీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతే కాకుండా.. ఈ సినిమా రామ్, పూరి కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది.

Andhra King Taluka | ఆలోచనలో పడ్డ రామ్..

ఇస్మార్ట్ శంకర్ మూవీ ఇచ్చిన కిక్ తో రామ్ వరుసగా రెడ్, వారియర్, డబుల్ ఇస్మార్ట్ అంటూ మాస్ సినిమాలు (movies) చేశారు. ఈ సినిమాలు ఏవీ కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. పి.మహేష్‌ బాబు డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. మాస్ సినిమా చేసినా సక్సెస్ రావడం లేదు.. హీరో, అభిమాని మధ్య అనుబంధం కథాంశంగా రూపొందిన ఫీల్ గుడ్ మూవీగా చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా కూడా హిట్ అనిపించుకోలేకపోయింది.

Andhra King Taluka | సరికొత్త థ్రిల్లర్..

ఇప్పుడు రామ్ రూటు మార్చి హర్రర్ థ్రిల్లర్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అది కూడా కొత్త దర్శకుడితో రామ్ (Ram) ఈ ప్రయత్నం చేయబోతుండడం విశేషం. కిషోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఈ సినిమాను బాహుబలి ప్రొడ్యూసర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధంచిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. మరి.. రామ్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయత్నమైనా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

CLICK HERE TO READ రూటు మార్చిన వరుణ్‌..

CLICK HERE TO READ MORE