Death anniversary | ఎస్సీ వర్గీకరణను ఆపాలి..

Death anniversary | ఎస్సీ వర్గీకరణను ఆపాలి..
- దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తాం
- పీవీ.రావు వర్ధంతి సభలో నాయకులు
Death anniversary | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఉన్న మాలలు ఎస్సీ వర్గీకరణను ఆపాలని కోరుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని వీడాలని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. సోమవారం మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పీవీ రావు 20వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైసీ పుల్లయ్య, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరిలు మాట్లాడుతూ.. పీవీ రావు వర్గీకరణ ఉద్యమంలో తన ఉద్యోగ సైతం లెక్కచేయకుండా ప్రాణాలను అర్పించారన్నారు. మాల సోదరులందరూ పీవీ రావు బాటలో నడవాలని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. వర్గీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షుడు మద్దిలేటి మాల మహాసభ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర, మాజీ సర్పంచి మద్దిలేటి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇల్లూరి భూపాల్, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
