Temperatures | ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి పులి

Temperatures | ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి పులి

  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • గ్రామాల్లో చలిమంటలతో సేద తీర్చుకుంటున్న ప్రజలు

Temperatures | ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్ ఏజెన్సీ మండలాల్లో రోజురోజుకు చలి తీవ్రతలు అధికం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు(Temperatures) పడిపోవడంతో గత కొద్ది రోజులుగా చలిపులి ప్రజలను వనికిస్తుంది. మారుమూల గ్రామాల్లో చలి తీవ్రత‌కు ప్రజలు గజగజ వణుకుతూ చలిమంటలు పెట్టుకొని సేద తీర్చుకుంటున్నారు.

చలి తీవ్రత‌తో పెద్దలు, చిన్నలతో పాటు వృద్ధులు(elderly) అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 7, 8 గంటల ప్రాంతంలో చలి తీవ్రతతో చాలామంది మార్కెట్లోకి, బయటకు వెళ్ళకుండా ఇళ్లలోనే ఉంటూ చలిమంటలు కాచుకుంటూ సేద తీర్చుకుంటున్నారు. బయటికి వెళ్లాలంటే చలి పులి గజగజ వారికిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఏజెన్సీలో గత ఏడాది కంటే ఈడాది వర్షాలు అధికంగా కురవడంతో చలి తీవ్రత కూడా ఉట్నూర్ సిర్పూర్ యు ఏజెన్సీలో నార్నూర్, తదితర మండలాల్లో రోజురోజుకు చలి తీవ్రత(cold intensity) అధికంగా కావడంతో ప్రజలు గజగజ వణుకుతూ ఇబ్బందులు పడుతున్నారు. మార్మూల మారుమూల గ్రామాల్లోని వృద్ధులకు సరిగ్గా దుప్పట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రైవేట్(private) పలు స్వచ్ఛంద సంస్థలు, మారుమూల గ్రామాల్లోని నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, బ్లాంకెట్లు పంపిణీ(blanket distribution) చేసేవారు.

ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉన్నా ఏ స్వచ్ఛంద సంస్థలు గాని, ప్రభుత్వ పరంగా గాని నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, బ్లాంకెట్లు ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతూ చలిమంటలు కాస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

Leave a Reply