1.5 millions ago | మానవ పరిణామంలో కొత్తకోణం!

1.5 millions ago | ఆంధ్రప్రభ : మానవ పరిణామంలో కొత్త కోణాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. పరిణామక్రమం ప్రారంభ దశ సంక్లిష్టతలపై ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. ఆఫ్రికా నుంచి వలస వెళ్లిన తొలి మానవజాతి గురించి కొత్త అంతర్‌దృష్టిని వివరించారు. అరిజోనాలోని మిడ్‌వెస్ట్రన్‌ యూనివర్శిటీలోని పాలియో ఆంథ్రోపాలజిస్ట్‌ డాక్టర్‌ కరెన్‌ బాబ్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధన బృందం ఈ అధ్యయనం చేసింది.

ఇథియోపియాలోని గోనా ప్రాంతంలో లభ్యమైన 1.5 మిలియన్‌ ఏళ్ల నాటి పురాతన కపాలాన్ని (పుర్రె) శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు ఉపయోగించారు. ఈ పుర్రె దంతాలు, ఎముక, ముఖాన్ని ఆధునిక టెక్నాలజీతో డిజిటల్‌గా పునర్‌ నిర్మించారు. లక్షల ఏళ్ల కిందట జీవించి వున్న మానవుల ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ అన్వేషణ ద్వారా ఇది హోమో ఎరెక్టస్‌ లేదా ప్లీస్టోసీన్‌ హొమినిన్‌ (ఆఫ్రికా నుంచి మొదటిసారి బయటకు వెళ్లిన వలసజాతి) జాతికి చెందినది కపాలంగా నిర్ధారించారు. ఈ పరిశోధన ఇటీవల నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

డాన్‌5 అనే వ్యక్తికి చెందిన ఈ కపాలంలోని మెదడు భాగం (బ్రెయిన్‌ కేస్‌) సాధారణ హోమో ఎరెక్టస్‌ లక్షణాలను కలిగివుంది. కానీ ముఖం, దంతాలు మాత్రం అతి పురాతనమైవి. ముందుజాతులైన హోమో హాబిలిస్‌కి చెందినట్లు కనిపిస్తున్నాయి. మానవ పరిణామం ఒక సరళరేఖలో జరగలేదని, సంక్లిష్టంగా, వైవిధ్యంగా మార్పులు వచ్చాయని ఈ అధ్యయనం సూచిస్తుంది. ఇప్పటి వరకు ఆఫ్రికాలోని హోమో ఎరెక్టస్‌ అధునాతన లక్షణాలతో పరిణామం చెంది బయటకు వెళ్లిందని భావించేవారు.

1.5 millions ago |ఆరు మిలియన్‌ సంవత్సరాల హోమినిస్‌ శిలాజాలు

కానీ తాజా అధ్యయనం ప్రకారం, పురాతన ముఖ లక్షణాలు కలిగిన జనాభా ఆఫ్రికా నుంచి వలస వెళ్లి ఉండవచ్చనే వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇది మానవ వలసలు, పరిణామం గురించిన మునుపటి అంచనాలను మార్చివేస్తున్నది. గోనా ప్రాంతం మానవ పరిణామ అధ్యయనాలకు చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఆరు మిలియన్‌ సంవత్సరాల నాటి పురాతన హోమినిస్‌ శిలాజాలు, 2.6 మిలియన్‌ ఏళ్ల నాటి మానవ సాంకేతిక పరిణామాన్ని నమోదు చేసే రాతి పనిముట్లు బయట పడ్డాయి.

గోనా జాతి అనేది మూడు లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా నుంచి వలస వచ్చిన జనాభా శరీర నిర్మాణశాస్త్రానికి మూలం. 1.8 మిలియన్‌ సంవత్సరాల కిందట ఆఫ్రికా, ఆసియా, యూరప్‌ అంతటా ఈ జనాభా విస్తరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 2000 సంవత్సరంలో గోనాలో ఫీల్డ్‌వర్క్‌ సమయంలో డాన్‌5 కపాలాన్ని పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని పునర్‌నిర్మించేందుకు అధిక రిజల్యూషన్‌ మైక్రో-సీటీ స్కాన్‌లను ఉపయోగించారు.

1.5 millions ago
1.5 millions ago

తద్వారా 3డీ నమూనాలు రూపొందించారు. ఆపై ముఖ భాగాలను కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఉంచి, పైదవడ భాగంలో వీలైనచోట దంతాలను అమర్చారు. చివరిదశలో ముఖం భాగాన్ని మెదడుకు జోడించి కపాలానికి పూర్తిరూపం ఇచ్చారు. ఇలా చేయడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందట. డాన్‌5 ముఖం, దంతాల పరిమాణం, ఆకారాన్ని అదే భౌగోళికయుగానికి చెందిన ఇతర శిలాజాలతో పోల్చడం ద్వారా శాస్త్రవేత్తలు కొత్త విషయాలను కనుగొన్నారు.

1.5 millions ago | శరీర నిర్మాణ వైవిధ్యాన్ని నొక్కిచెబుతుంది

ఉదారహణకు ముక్కు వంతెన చాలా చదునుగా ఉందని, ముక్కు రంధ్రాలు పెద్దవిగా ఉన్నాయని తేల్చారు. కొత్తగా పునర్‌నిర్మించిన కపాలం మానవ జాతిలోని ప్రారంభ జనాభాలో కనిపించే శరీర నిర్మాణ వైవిధ్యాన్ని నొక్కిచెబుతుంది. ఇది భవిష్యత్‌ ఆవిష్కరణలలో మరింత స్పష్టమయ్యే అవకాశముందని అధ్యయన సహ రచయిత సెంట్రల్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ సారా ప్రీడ్‌ లైస్‌ వివరించారు.

click here to read గుండెల్లో కార్చిచ్చు..

click here to read more

Leave a Reply