2 Friends Killed : పాపం ఫ్రెండ్స్ Andhra Prabha Crime News

2 Friends Killed : పాపం ఫ్రెండ్స్ Andhra Prabha Crime News
- అక్కడికక్కడే దుర్మరణం
- ఎగువ పాలకూరులో విషాదం
- అదుపు తప్పిన బైక్
- డివైడర్ ను ఢీకొని ప్రాణాలు వీడిన స్నేహితులు
- అనారోగ్యం బాలుడిని పరామర్శించిన మిత్రులు
- తిరుగు ప్రయాణంలో ఘోరం
(చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో)
2 Friends Killed : చిత్తూరు జిల్లా కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసముద్రం బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఎగువ పాలకూరు గ్రామంలో విషాద ఛాయలు నింపింది. మృతులను పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు గ్రామానికి చెందిన బి. హేమాద్రి అలియాస్ చంటి (22), తాడికి బి. శివాజీ అలియాస్ టీ. సుధ (38)గా పోలీసులు గుర్తించారు.

2 Friends Killed : సమాచారం మేరకు ఎగువ పాలకూరు గ్రామానికి చెందిన హేమాద్రి, శివాజీ బంధువుల ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించేందుకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో హేమాద్రి తన స్నేహితుడు శివాజీతో కలిసి బైక్ పై బయలుదేరారు.
శుక్రవారం ఉదయం సుమారు 5.20 గంటల సమయంలో చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారిపై బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపానికి రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపైకి ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
2 Friends Killed : ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న కాణిపాకం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2 Friends Killed : మృతుడు హేమాద్రి గ్రామంలో చురుకైన యువకుడిగా పేరుపొందినట్లు గ్రామస్తులు తెలిపారు. శివాజీ కూడా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని చెప్పారు. ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది.
ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారులపై అతి వేగంతో ప్రయాణించవద్దని, ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి సమయాల్లో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించడం, నియంత్రిత వేగంతో ప్రయాణించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
