Nayakpuguda | ఉపసర్పంచ్‌కు పిఏసిస్ చైర్మన్ దంపతుల ఘన సన్మానం

తిర్యాణి, ఆంధ్రప్రభ: మూడో విడత ఎన్నికల్లో నాయకపుగూడ గ్రామానికి చెందిన మూడో వార్డు యువ నేత కొదురుపాక పవన్ విజయం సాధించారు. నూతన ఉపసర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, తిర్యాణి మండల పి ఏ సిస్ చైర్మన్ దంపతులు ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు.
ఈ సందర్భంగా చైర్మన్ చుంచు శ్రీనివాస్ మాట్లాడుతూ, యువకులు రాజకీయ రంగంలోకి రావడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
