Chityala | విద్యుద్ఘాతంతో పత్తి దగ్ధం

Chityala | విద్యుద్ఘాతంతో పత్తి దగ్ధం

  • తృటిలో తప్పిన ప్రమాదం

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లికి చెందిన రైతు పల్లెవేన రమేష్, ఇంటి వరండ మీటర్ ప్రాంగణంలో విద్యుద్ఘాతంతో పత్తి, వడ్లు, దగ్ధమై కాలిపోయాయి. దీంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… తన కూతురును గురువారం తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం గృహ విద్యుత్తు వైరు ప్రమాదవశాత్తు మంటలు లేచి ఇంటి వరండాలో ఉన్న ఐదు క్వింటాల పత్తి, నాలుగు బస్తాల వడ్లు దగ్ధ‌మై, దాదాపు రూ.50వేల నష్టం జరిగినట్లు బాధిత రైతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. సంఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్ కొడారీ అశోక్ సందర్శించి రైతు కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించేలా కృషి చేస్తామన్నారు.

Leave a Reply